టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వారి పెళ్లి ఫొటోలు, వీడియాలు మాత్రం బయటకు రాలేదు.
తాజాగా తన పెళ్లి వీడియోను రకుల్ సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో హల్దీ, సంగీత్, వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను క్యాప్చర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా రకుల్ – జాకీ భగ్నానీ వివాహం.. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.
View this post on Instagram