తెలుగులో అగ్ర హీరోయిన్ గా చెలామణి అవుతోన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు తమిళంలో
కూడా సినిమాలు చేయడానికి సిద్ధపడుతోంది. ఈ నేపధ్యంలో విశాల్ హీరోగా వస్తోన్న
తుప్పరివాలన్ సినిమాలో హీరోయిన్ ఎంపికైంది. అలానే విక్రమ్ హీరోగా నటిస్తోన్న ‘సామి’
సినిమా సీక్వెల్ లో కూడా రకుల్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. అయితే ఇప్పుడు సడెన్
గా విశాల్ సినిమా నుండి రకుల్ తప్పుకుందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి
వస్తే.. రకుల్ ఈ సినిమా కోసం ముందుగానే డేట్స్ ను ఇచ్చేసిందట. అయితే ఇప్పుడు విశాల్
కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీ కావడంవలన ఆయనకు తగ్గట్లుగా రకుల్ డేట్స్ ను కేటాయించలేకపోతోంది.
అలా చేస్తే తనకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇక ప్రాజెక్ట్ నుండి
తప్పుకోవడం మంచిదని భావించి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాకపోతే విక్రమ్
సినిమా చేతిలో ఉందనే ధీమాతో అమ్మడు ఉందని అంటున్నారు.