HomeTelugu Reviews'రాక్షసుడు' మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

7 1నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సారి క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యాన్నిఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్‌(తమిళ మూవీ రాక్షసన్‌)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ హీరోకు.. విజయం లభించిందా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే

కథ: స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) సినీ రంగంలో తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటాడు. దర్శకత్వం చేపట్టాలని ప్రతీ ఆఫీస్‌ గడప తొక్కుతూ ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కోసం ప్రపంచంలో నలుమూలలా జరిగే సైకో హత్యల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే అరుణ్‌కు సినీ రంగంలో అవకాశాలు రాక.. చివరకు కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్‌ ఉద్యోగంలో చేరతాడు. అరుణ్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ అయిన తరువాత మళ్లీ ఓ హత్య జరగుతుంది. ఇక ఆ హత్యలను చేసేది ఎవరనే విషయాన్ని అరుణ్‌ కనిపెట్టాడా? అసలు ఆ హత్యలు చేసే వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? అనేదే మిగతా కథ.

నటీనటులు: ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌.. యాక్షన్‌ సీన్స్‌తోపాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. ఇంతకుముందు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించినా.. ఈ మూవీలో మాత్రం ఇంటెన్సిటీతో నటించాడు. ఇక టీచర్‌గా కృష్ణవేణి పాత్రలో అనుపమా.. లుక్స్‌తో బాగానే ఆకట్టుకుంది. కనిపించింది తక్కువే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు. రాక్షసుడు పాత్రను తెరపై చూస్తేనే ఆ థ్రిల్‌ను ఫీల్‌ అవ్వొచ్చు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.

7a

విశ్లేషణ: సినిమాకు కథ ముఖ్యం. కథే సినిమాను నడిపించాలి. అలా ఓ కథ.. ఒక భాషలో విజయవంతం అయినా.. మిగతా భాషల్లో అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తుందా అంటే చెప్పలేం. అయితే హారర్‌, సైకో థ్రిల్లర్‌, క్రైమ్‌ ఇలాంటివాటికి భాషతో పని ఉండదు. ఇలాంటి వాటిని ఓ వార్గం వారు మాత్రమే ఇష్టపడతారు. అలా తమిళంలో హిట్‌ కొట్టిన రాక్షసన్‌ చిత్రాన్ని ‘రాక్షసుడు’ గా తెలుగు ప్రేక్షకులకు అందించారు. రీమేక్‌ చేయడం కత్తి మీద సాములాంటింది. కొత్తవి చేరిస్తే.. పాడు చేశారు అంటారు. ఉన్నవి తీసేస్తే ఫీల్‌ మిస్‌ చేశారంటారు. అలా రీమేక్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాల్సి వస్తుంది.

రాక్షసుడు చిత్రానికి కూడా అలాంటి సమస్యే వచ్చింది. ఇలాంటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఎలాంటి రిపేర్‌ చేయకుండా యథాతథంగా తెరకెక్కించారు. అయినా సరే థ్రిల్లింగ్‌కు గురి చేసే ఎన్నో అంశాలు ఉండటం.. సీటు అంచున కూర్చోబెట్టే మూమెంట్స్‌ ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఫస్ట్‌ టైమ్‌ ఈ చిత్రాన్ని చూస్తున్నవారికి మాత్రమే అలాంటి థ్రిల్‌కు గురవుతారు. థ్రిల్లర్‌ మూవీతో వచ్చే చిక్కే అది.. ఓ సారి కథాకమామీషు తెలిశాక సినిమాను చూడలేం. తమిళంలో ఓ మూవీ హిట్‌ అయింది.. బాగుంది అని తెలిశాక మనవాళ్లు చాలామంది చూసేస్తున్నారు. మరి అలా చూసిన వారిని ఈ సినిమా అంత ఆశ్చర్యానికి గురి చేయకపోవచ్చు. మాతృకను చూడని వారిని రాక్షసుడు మాత్రం కచ్చితంగా భయపెట్టిస్తాడు.. థ్రిల్‌కు గురిచేస్తాడు. ఇక గిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్‌ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

7b

హైలైట్స్‌ :
కథ, కథనం

డ్రాబ్యాక్స్ :
ద్వితీయార్ధంలో సుదీర్ఘంగా సాగడం

టైటిల్ : రాక్షసుడు
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు
దర్శకత్వం : రమేష్‌ వర్మ
నిర్మాత : కోనేరు సత్యనారాయణ

చివరిగా : థ్రిల్‌ కలిగించే ‘రాక్షసుడు’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సారి క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యాన్నిఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్‌(తమిళ మూవీ రాక్షసన్‌)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ హీరోకు.. విజయం లభించిందా? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే కథ: స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు...'రాక్షసుడు' మూవీ రివ్యూ