మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న(ఆగస్టు22)న చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబంలో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్‌చరణ్, సాయితేజ్ ఇలా మెగా కుటుంబం అంతా ఒకచోట చేరి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.