HomeTelugu Big Storiesరివ్యూ: రాజు గారి గది2

రివ్యూ: రాజు గారి గది2

నటీనటులు: నాగార్జున, సమంత, అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సీరత్ కపూర్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: దివాకరన్
ఎడిటింగ్: మధు
నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి
దర్శకత్వం: ఓంకార్
‘రాజు గారి గది’ సినిమా హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా దర్శకుడు ఓంకార్ ‘రాజు గారి గది2’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగార్జున, సమంతలు కలిసి నటించడంతో బాగా హైప్ పెరిగింది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
అశ్విన్, కిషోర్, ప్రవీణ్ ముగ్గురు కలిసి ఓ రిసార్ట్ బిజినెస్ మొదలుపెడతారు. కొద్దిరోజుల్లో ఆ రిసార్ట్ లో ఉండే దెయ్యం వారిని భయపెడుతుంటుంది. దీంతో ఆ ముగ్గురు కలిసి చర్చ్ ఫాదర్ ని కలుస్తారు. ఆయన సలహాతో మెంటలిస్ట్ రుద్ర(నాగార్జున) దగ్గరకు వెళ్తారు. ఎదుటివారి కళ్ళను చూసి వారు మనసులో ఏం ఆలోచిస్తున్నారో.. చెప్పగల రుద్ర రిసార్ట్ లోకి అడుగుపెడతారు. అక్కడ అమృత(సమంత) అనే అమ్మాయి ఆత్మ ప్రతీకారం కోరుకుంటుందనే విషయాన్ని
తెలుసుకుంటాడు రుద్ర. తనకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ అమృత ఎవరు..? ఆమె ఆత్మ రిసార్ట్ లో ఉండడానికి గల కారణాలు ఏంటి..? ఆమెకు ఎలాంటి అన్యాయం జరిగింది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
తనకు జరిగిన అన్యాయంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన అమ్మాయి ఆత్మగా మారుతుంది. ఆ ఆత్మకు ఓ మెంటలిస్ట్ సహాయం దొరికితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. కామెడీ సన్నివేశాల్లో సరైన పంచ్ అనేది లేకుండా పోయింది. కథలోకి రుద్ర పాత్ర ఎంటర్ అయినప్పటినుండి కథనం ఊపందుకుంటుంది. సినిమాలో హారర్
సన్నివేశాలు మరీ భయపెట్టే విధంగా అయితే లేవు.

సెకండ్ సినిమాకు ప్రధాన బలం. పతాక సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. సినిమాలో సమంత పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. నాగార్జున, సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. ఈ ఇద్దరు స్టార్లు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సమంత తన హావభావలతో, డైలాగ్స్ తో మెప్పిస్తుంది. ఇక నాగార్జున తన స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. 

టెక్నికల్ గా సినిమా హైరేంజ్ లో ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. తమన్ నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. అక్కడక్కడా సినిమా స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించాలనే కసితో దర్శకుడు ఓంకార్
తెరకెక్కించిన ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది.
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu