గతంలో రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’,’కథానాయకుడు’ వంటి చిత్రాల్లో నటించి
మెప్పించింది నయనతార.
ఇప్పుడు మరోసారి ఆయనతో జత కట్టడానికి సిద్ధపడుతోంది. రజినీకాంత్ ప్రస్తుతం
రోబో2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే రంజిత్ డైరెక్షన్ లో రజిని ఓ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా అమలపాల్ ను ఎన్నుకున్నట్లు సమాచారం. అలానే ఈ
సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశం ఉండడంతో నయనతారను తీసుకునే ఆలోచనలో
దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
నయనతార కూడా ఈ ఆఫర్ ను వదులుకునే అవకాశాలు లేవు. సో.. మరోసారి ఈ
జంటను తెరపై చూడొచ్చు.