HomeTelugu Trendingవిడిపోతున్నామంటూ శిల్పాశెట్టి భర్త పోస్ట్ వైరల్

విడిపోతున్నామంటూ శిల్పాశెట్టి భర్త పోస్ట్ వైరల్

Shilpa Shetty 1

నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా తాజాగా సంచలన ప్రకటన చేశాడు. రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మేము విడిపోతున్నాము.. ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్‌గా నిలవండి అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.

రాజ్‌కుంద్రా నటించిన ‘యూటీ 69’ మూవీ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పోర్నోగ్రఫీ కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టు తరువాత రాజ్‌కుంద్రా బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. నాటి నుంచి అతడు మాస్కు పెట్టుకునే మీడియా ముందుకు వస్తున్నాడు.

త్వరలో తన మూవీ విడుదల అవుతున్నందున రాజ్‌కుంద్రా మాస్కు లేకుండా తొలిసారి మీడియా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రాజ్‌ కుంద్రా జీవితంలోని కాంట్రవర్సీలే నేపథ్యంగా రూపొందిన ‘యూటీ 69’ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. రెండేళ్ల క్రితం పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా తాను జైల్లో పడ్డ మానసిక సంఘర్షణలను ఈ మూవీలో చూపనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu