Vettaiyan OTT release date:
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టైయన్ అక్టోబర్ 10న విడుదలై ప్రేక్షకుల నుండి ఆశించిన స్పందన పొందలేదు. ప్రముఖ దర్శకుడు టీ.జే. గ్నానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి వంటి ప్రముఖ నటుల సమకూర్పుతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది.
Meet the heart and soul of VETTAIYAN 🕶️ Introducing THARA 🌟 A pillar of strength and elegance. ✨#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada! @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran pic.twitter.com/OukftPns5B
— Manju Warrier (@ManjuWarrier4) September 17, 2024
అయితే, ఈ చిత్ర కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో కొన్ని లోపాలు ఉండటంతో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం అందించలేకపోయింది. వేట్టైయన్ చిత్రానికి 300 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టినా, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 246 కోట్లను మాత్రమే వసూలు చేసింది. గతంలో రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ 604 కోట్ల వసూళ్లు సాధించి ఘనవిజయం సాధించింది. అందుచేత వెట్టైయన్ సినిమాను అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురుచూసినా, థియేటర్లలో ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
ఈ నేపధ్యంలో, ఈ చిత్రం నవంబర్ 7న ఆమేజాన్ ప్రైమ్ వేదికపై ఓటీటీలో విడుదల అవబోతోందని తాజా సమాచారం. థియేటర్‌లో చూడని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓటిటి లో చూసేయచ్చు. మరి ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది? థియేట్రికల్ పరాజయాన్ని ఓటీటీలో అధిగమించి హిట్ అవుతుందా అని వేచి చూడాలి.
Read More: Film Industry కి పైరసీ కారణంగా ఎన్ని కోట్ల నష్టం కలిగిందో తెలుసా?