
Coolie Pre-Release Business:
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న Coolie సినిమాపై టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. అదే రోజున ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న “వార్ 2” కూడా థియేటర్లలోకి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద మజా రెట్టింపవుతోంది.
ఇదిలా ఉండగా, “కూలీ” సినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం ప్రస్తుతం టాలీవుడ్‌లో 6మంది ప్రముఖ నిర్మాతలు పోటీపడుతున్నారు. సన్ పిక్చర్స్ వద్ద హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, “కూలీ” తెలుగు వెర్షన్ రైట్స్‌కు నిర్మాతలు రూ.40 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర టాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే చాలా పెద్దదే. అయితే ఇంకా డీల్ ఫైనల్ కాలేదు. కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, శృతిహాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సినిమా కాస్టింగ్ చూసినప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు బాగానే పెరిగిపోయాయి.
ఇలాంటి క్రేజీ కాంబినేషన్లు, భారీ బడ్జెట్, అగ్ర దర్శకుడు ఉండటంతో “కూలీ” సినిమా తెలుగు రైట్స్ మార్కెట్లో హాట్ కేక్ అయింది. చివరికి ఎవరికి ఈ హక్కులు దక్కుతాయో వేచి చూడాలి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు తెలుగు హక్కులపై డీల్ ఫైనల్ అయితే, అది ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.