HomeTelugu Trendingఇళయరాజాకు రజనీకాంత్‌ శుభాకాంక్షలు

ఇళయరాజాకు రజనీకాంత్‌ శుభాకాంక్షలు

Rajinikanth wishes to ilaya
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి కోటాలో ఈయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా నియమితులైన తన ప్రియ మిత్రుడు, సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారికి హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. ఇళయరాజా, రజనీకాంత్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత 28 ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతోంది.

రాష్ట్రప‌తి కోటాలో ప‌లు రంగాల‌కు చెందిన న‌లుగురిని నామినేట్ చేస్తూ న‌రేంద్ర మోడీ స‌ర్కారు నిన్న కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ జాబితాలో ఇళయరాజాతో పాటు ప్రముఖ సినీ కథా రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, ప‌రుగుల రాణి పీటీ ఉష‌, వీరేంద్ర హెగ్డేల‌ను ఎన్డీఏ స‌ర్కారు రాజ్య‌స‌భకు నామినేట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu