మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అత్యాధునిక హంగులతో సొంతంగా స్టూడియో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సూడియోను సూపర్‌స్టార్ రజనీకాంత్ మంగళవారం సందర్శించారు. ఈ స్టూడియో చెన్నైలోని కోడంబాక్కంలో ఉంది. స్టూడియో సందర్శించారు. ఈ స్టూడియో ప్రారంభోత్సవం రోజున హీరో విజయ్ సేతుపతితో పలువురు సినీ ప్రముఖలు వచ్చి ఇళయరాజాను అభినందించారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి ఇళయరాజా వెళ్ళారు. ఆ సమయంలో వివిధ అంశాలపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా ఇళయరాజా స్టూడియో నిర్మాణం గురించి రజినీకాంత్ వాకబు చేశారు. ఆ తర్వాత ఇళయరాజాతో కలిసి రజనీకాంత్ కూడా ఆ స్టూడియోకు వెళ్ళి సందర్శించారు. స్టూడియో మొత్తం కలియ తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. ఈ స్టూడియో నిర్మాణాన్ని చూసిన ఆయన అబ్బురపరిచేలా నిర్మించారంటూ ఇళయరాజాను అభినందించారు. ఒక ఆలయం లోపలికి ప్రవేశించినట్టుగా ఉందని రజనీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత స్టూడియోలో ఇళయరాజాతో ఎక్కువంద సమయం గడిపారు. ఈ క్రమంలో రెండో రోజైన మంగళవారం కూడా మరోమారు రజినీకాంత్ ఈ స్టూడియోకు వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.