సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.600 కోట్ల వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. రజనీకాంత్ ఎప్పుడూ.. నిరాడంబరంగా గడుపుతుంటారు. తన మూలాలను ఎన్నడూ మరచిపోలేదు. ఈ నేపథ్యంలో తాను గతంలో పని చేసిన సంస్థను సందర్శించారు రజనీకాంత్.
సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులో జయనగర్ బీఎంటీసీ డిపోలో ఆయన పని చేసేవారు. ఈ రోజు అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా రజనీకాంత్‌ను చూసిన సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు. వారితో రజనీకాంత్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Just IN: #Rajinikanth made a surprise visit today to Bengaluru, Jayanagar Bus🚌🚏 Depot where he started his career as conductor.
SELF made superstar for a reason!
||#Jailer | #600CrJailer|| pic.twitter.com/iYNXDWZmDD
— Manobala Vijayabalan (@ManobalaV) August 29, 2023