సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎన్నాళ్టి నుంచో వేచిచూస్తున్న రాజకీయ అరంగేట్రం ఖరారైంది. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ క్లారీటి ఇచ్చేశారు. తాను సొంతంగా పార్టీ పెడతానంటూ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ లాంచింగ్ కార్యక్రమం ఉంటుందని రజనీ వెల్లడించారు. తలైవా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన పార్టీ రజనీ మక్కళ్ మండ్రం (ఆర్‌ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమై చర్చించారు. అనంతరం పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. వాళ్ల (ఆర్‌ఎంఎం కార్యదర్శులు) అభిప్రాయాలను వాళ్లు చెప్పారని, తన అభిప్రాయాన్ని తాను తెలియజేశానని రజినీ తెలిపారు. ‘నా నిర్ణయం ఏదైనా సరే నా వెంటే ఉంటానని వాళ్లు చెప్పారు. నా నిర్ణయాన్ని వీలైనంత త్వరగా వెల్లడిస్తాన’ని చెప్పారు. రజనీకాంత్ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
పార్టీ పెడతారా లేదా అనే అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ రజనీకాంత్ ఎట్టకేలకు స్పష్టం చేశారు. డిసెంబర్ 31న పార్టీ వివరాలు వెల్లడించనున్నారు. తన అభిమానులకు రజనీకాంత్ నూతన సంవత్సరం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీచేయబోతున్నట్లు తెలిపారు.
ஜனவரியில் கட்சித் துவக்கம்,
டிசம்பர் 31ல் தேதி அறிவிப்பு. #மாத்துவோம்_எல்லாத்தையும்_மாத்துவோம்#இப்போ_இல்லேன்னா_எப்பவும்_இல்ல 🤘🏻 pic.twitter.com/9tqdnIJEml— Rajinikanth (@rajinikanth) December 3, 2020