HomeTelugu Newsనా మొదటి సినిమాకు ఎదురుచూశా మళ్లీ '2.ఓ' కోసం చూస్తున్నా

నా మొదటి సినిమాకు ఎదురుచూశా మళ్లీ ‘2.ఓ’ కోసం చూస్తున్నా

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ.. రోబో రిలీజ్‌ సమయంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనకు తెలుగురాదని శంకర్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడరని కానీ.. ఇప్పుడు మాత్రం తెలుగులో మాట్లడటం ఆశ్చర్యంగా ఉందని రజనీకాంత్‌ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘రోబో రిలీజ్‌ అయి 8 ఏళ్లు అవుతుంది. అప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఆయన ఇప్పుడు తెలుగులో బాగా మాట్లాడారు. తెలుగు వాళ్లను ఎవరైనా ఇష్టపడతారు. తెలుగింటి భోజనం లోక ప్రసిద్ది. తెలుగు సంగీతం ఆనందమైంది. తెలుగు అమ్మాయిల గురించి వేరే చెప్పనవసరం లేదు.

11 12

రోబో సమయంలో ఒక రీల్‌ను 3డీలో తీద్దామని చూశాము. అది చూశాక ఆసమయంలోనే.. మంచి కథ దొరికితే త్రీడీలోనే పూర్తి సినిమా తీద్దామని శంకర్‌ అన్నారు. ఓ మూడు నాలుగేళ్ల క్రితం శంకర్‌ నా దగ్గరకు వచ్చి త్రీడీ సినిమా తీద్దామని చెప్పాడు. అతడు ఒక మెజిషియన్‌. కథ, దానికి తగ్గట్టు విజువల్స్‌ కలిశాయి కాబట్టే బాహుబలి అంత సక్సెస్‌ అయింది. 2.ఓ విషయంలో కూడా కథ, టెక్నాలజీ, గ్రాఫిక్స్‌, త్రీడీ ఎఫెక్ట్స్‌ అనీ కుదిరాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది. దీనికి సహకరించిన నిర్మాత సుభాస్కరణ్‌కు హ్యాట్సాఫ్‌. ఈ సినిమాకు ప్రమోషన్సే అవసరం లేదు ఎన్వీ ప్రసాద్‌ ఊరికే వీటికోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. సినిమా చూసి ప్రేక్షకులే ప్రమోట్‌ చేస్తారని చెప్పాను. నా మొదటి సినిమా అపూర్వాంగళ్‌ సినిమాకు ఎంత ఎదురుచూశానో మళ్లీ 2.ఓ కోసం అంత ఎదురుచూస్తున్నాన’ని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu