HomeTelugu Newsతన భార్యను పొగడ్తలతో ముంచెత్తిన రజనీ

తన భార్యను పొగడ్తలతో ముంచెత్తిన రజనీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్‌ స్టార్‌. గురువారం విడుదలైన రజనీ 2.ఓ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో రజనీ ఇండియా టూడేతో ముచ్చటించారు‌. ఈ సందర్భంగా ఆయన తన భార్య ‘లతా’ రజనీకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు . ‘తను నా పిల్లలను, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. తను నాకు స్నేహితురాలు, ఫిలాసఫర్‌’ అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్‌.

13 7

ఈ సందర్భంగా తన పిల్లలు దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌, డైరెక్టర్‌ కం ప్రొడ్యూసర్‌ సౌందర్య రజనీకాంత్‌ల గురించి కూడా మాట్లాడారు. ‘నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా పిల్లలిద్దరూ వారికి నచ్చిన రంగంలోనే స్థిరపడ్డారు. వారు చేసే పని పట్ల వారు సంతోషంగా ఉన్నారం’టూ చెప్పుకొచ్చారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu