సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కరోనా లాక్‌డౌన్‌లో కూడా ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. తాజాగా లాక్ డౌన్ వేళ రజనీ.. ఇలా మార్నింగ్ వాక్ కు వెళ్తూ కెమెరాకు చిక్కారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోలో టీషర్ట్ , బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించి ఉన్నాడు. లాక్‌డౌన్ సమయంలో జనాలంతా ఇళ్లలో ఉంటే రజనీ మాత్రం చాలా యాక్టీవ్‌గా వీధుల్లో మార్నింగ్ వాకింగ్ వెళ్లడం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం రజనీ మార్నింగ్ వాక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘అన్నాత్తే’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రజినీకాంత్ ఇటీవల చెన్నైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సిరుతై శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.