తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘తలైవర్ 171’ (వర్కింగ్ టైటిల్)తో ఈ సినిమా తెరకెక్కనుందని ఈమధ్యే ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు శుభవార్త ప్రకటించాడు లోకేశ్ ఇటీవలే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో శివకార్తికేయన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు స్పష్టం చేశారు. ‘స్క్రిప్ట్‌వర్క్ పూర్తైంది.
చాలా ఏళ్ల తర్వాత రజనీ సార్ ఇందులో పూర్తిస్థాయిలో యాక్షన్ చేయనున్నారు. మా కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు మొదలవుతుందని తెలియగానే కమల్ సర్ మొట్టమొదట ఫోన్ చేసి గుడ్‌లక్ చెప్పారు’ అంటూ వివరాలు వెల్లడించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చుతున్నారు.