సూపర్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నట్లు వినికిడి. కమల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఒక కీలక పాత్రలో రజనీకాంత్‌తో నటింపజేయాలనే ఉద్దేశంతో మణిరత్నం ఉన్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని చెబుతున్నారు.
కమల్ తో మణిరత్నం చేసిన ‘నాయకుడు’ .. రజనీతో చేసిన ‘దళపతి’ వారి కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోయాయి. అలాంటి ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయడానికి మణిరత్నం రెడీ అవుతున్నారు. నిజానికి తాము కలిసి నటించకూడదని చాలాకాలం క్రితమే రజనీ – కమల్ నిర్ణయించుకున్నారు. కానీ మణిరత్నం విషయంలో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు.