Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సలామ్’. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9 ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఆయన భారీ రెమ్యునరేషన్ మాత్రం రూ.40 కోట్ల వరకూ తీసుకున్నట్లు టాక్. మూవీలో రజనీకాంత్ కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. దీనికి కూడా అతడు ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేయడం వైరల్‌గా మారింది.
గతేడాది రజనీ నటించిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో రజనీ మళ్లీ లోన్‌లో పడ్డాడు. ఆ మూవీకి లాభాల పంట రావడంతో రజనీ ఏకంగా రూ.200 కోట్లకుపైగా రెమ్యునరేషన్ రూపంలో అందుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఓ లగ్జరీ కారు కూడా దక్కింది.
దీంతో ‘లాల్ సలామ్’కి ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ వసూల్ చేసినట్లు టాక్. అందుకు తగినట్లే ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా లాల్ సలామ్ మూవీ తెరకెక్కింది.
ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. అంతేకాదు ఈ మూవీ కోసం అతడు ఇద్దరు దివంగత సింగర్ల వాయిస్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీక్రియేట్ చేయడం విశేషం.