సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఆదాయపన్ను శాఖ దినోత్సవాన్ని ఆశాఖ అధికారులు ఆదివారం స్థానిక రాయపేటలోని మ్యూజిక్ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్ భండారీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కాగా ఈ వేదికపై తమిళనాడులో అత్యధికంగా పన్ను చెల్లించినందుకుగానూ రజినీకాంత్‌ను అభినందిస్తూ ఉత్తమ టాక్స్ పేయర్ అవార్డును ప్రదానం చేశారు. కాగా ఈ అవార్డును రజినీకాంత్‌కు బదులుగా ఆయన కూమార్తె ఐశ్వర్య రజినీకాంత్ పుదుచ్చేరి లెప్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై నుంచి అందుకున్నా రు. ఈ విషయాన్ని ఐశ్వర్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ‘సకాలంలో, అధిక పన్నులు చెల్లించే వ్యక్తి కుమార్తెగా గర్విస్తున్నాను. ఆదాయపన్ను శాఖ తమిళనాడు, పుదుచ్చేరికి ఎన్నో ధన్యవాదాలు’ అని ఐశ్వర్య పోస్ట్ పెట్టారు.