భారతీయ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజనీకాంత్ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురష్కారాన్ని తీసుకున్నారు. న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సోమవారం ఉదయం జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారతీయ సినిమా రంగానికి తన వంతు కృషి చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును రజనీకాంత్ స్వీకరించారు.
ఈ సందర్భగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను బెంగుళూరు లో బస్సు కండక్టర్ గా వున్నప్పుడు , తన సహోద్యోగి , బస్సు డ్రైవర్ తనని సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చి ప్రోత్సహించాడని , అతని వల్లనే తానూ సినిమా రంగంలో ప్రవేశించానని, అందుకే ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ అవార్డును అతనికి అంకితం చేస్తున్నానని ప్రకటించారు . సినిమా రంగంలో మొదట “అపూర్వ రాగంగాళ్ “లో అవకాశం ఇచ్చిన దర్శకుడు కె .బాలచందర్, తన నిర్మాతలు, దర్శకులు , అభిమానులకు కూడా ఈ అవార్డు ను అంకితం చేస్తున్నట్టు రజనీకాంత్ తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం భారత రాష్ట్రపతి రామనాథ్ కోవిందును రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.