
Rajinikanth Coolie OTT Rights:
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన స్టామినా చూపిస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ ‘కూలీ’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
తెలుగు మార్కెట్‌లో కూడా ఈ సినిమాపై క్రేజ్ బాగానే ఉంది. ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ దాదాపు ₹45 కోట్ల వరకు పలుకుతున్నాయి. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి భారీ తారాగణం ఉండటంతో సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో రజనీకాంత్ ‘దేవా’ అనే ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. హైదరాబాద్, జైపూర్, విశాఖపట్నం, బ్యాంకాక్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. స్టాండర్డ్ IMAX ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘కూలీ’ తర్వాత ‘జైలర్ 2’ కోసం కూడా సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గత ఏడాది ‘జైలర్’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. మొత్తానికి 75 ఏళ్ల వయసులోనూ యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్న రజనీకాంత్ ఎక్కడా తగ్గట్లేదు.