సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం స్వచ్చంద సంస్థలకు, ధార్మిక సంస్థలకు దానం చేసేది ఎవరు అంటే.. టక్కున గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని నిత్యం చెప్పే రజినీకాంత్.. ఆచరణలో కూడా ఆ డైలాగ్ ను అనుసరిస్తుంటారు. అందుకే మచ్చలేని చంద్రుడిగా కోలీవుడ్ లో వెలుగొందుతున్నాడు.
సినిమా హిట్టయ్యాక.. వేడుకల్లో పాల్గొనడం, వివిధ కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం రజినీకాంత్ కు నచ్చదు. వచ్చిన దానితో తృప్తి చెందాలి అని అనుకుంటాడు. అందుకే ఆయనను అభిమానులు దేవుడిగా భావిస్తారు. అభిమానులకు అన్ని విషయాల్లో రజినీకాంత్ తోడునీడగా ఉంటాడు అనే విషయం తెలిసిందే.
తాజాగా, ధర్మపురి జిల్లాకు చెందిన రజినీకాంత్ అభిమాని మహేంద్రన్ ఓ రోడ్ యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ ధర్మపురి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించాడు. రజిని మక్కల్ మందిరం పార్టీ తరుపున వారి కుటుంబానికి రూ.40 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, సొంతంగా మరో పదిలక్షల రూపాయల సహాయం అందించాడు. అంతేకాదు, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారి ఆస్తిని విడిపించి ఇచ్చారు. వారి పిల్లల చదువు విషయాలను తాను చూసుకుంటానని చెప్పారట.