సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘2 పాయింట్ 0’లో హీరోయిన్గా నటించింది యామీ జాక్సన్. స్వతహాగా బ్రిటిష్ మోడల్ అయిన ఈమె భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఈమె కొన్నాళ్లుగా బ్రిటన్ దేశపు మల్టీ మిలినియర్, ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ప్రేమలో ఉంది. కొంతకాలం డేటింగ్ చేసిన వీరి నిశ్చితార్థం జాంబియా అడవుల్లో జరిగింది. ఈ విషయాన్ని యామీ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.