టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తన అభిమాన దర్శకుడు జంధ్యాల అయితే, తన అభిమాన నటుడు రాజేంద్రప్రసాద్ అని అనిల్ రావిపూడి తరచూ చెప్పిన అనిల్.. ఎఫ్3లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను ఒక ముఖ్యమైన పాత్రలో చూపించనున్నట్టుగా తెలుస్తోంది.
కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగు త్వరలో మొదలుకానుంది. ‘ఎఫ్ 2’లో ఇద్దరి భార్యల భర్తగా నవ్వించిన రాజేంద్ర ప్రసాద్, ‘ఎఫ్ 3’ సినిమాలో పరమ పిసినారి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. జంధ్యాల సినిమా ‘అహ నా పెళ్లంట’లో ప్రతి విషయానికి ‘అయితే నాకేంటి?’ అంటూ పిసినారి పాత్రలో కోట చేయిజాపుతూ ఉంటాడు. అదే తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ సందడి చేయనున్నాడని చెబుతున్నారు.