ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న పాన్‌ఇండియా మూవీ ‘శాసనసభ’. సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకత్వం వహించాడు.
కాగా ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం..ఈ సందర్భంగా నిర్మాతలు తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ గారు ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది.
ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవిబస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. సినిమా కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది అన్నారు.
Wishing all a very happy Independence Day #IndiaAt75
Team #Sasanasabha #IndraSena #RajendraPrasad #VenuMadikanti #ShanmugamSappani #Thulasiramsappani @RaviBasrur #AishwaryaRaj @soniya_agg @sapbrofilms @kaanistudio #HappyIndependenceDay pic.twitter.com/G4kJlnILEU— Maduri Mattaiah (@madurimadhu1) August 15, 2022