టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు నటుడు రాజీవ్ కనకాల ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సిని‘మా’ రాజకీయాలు అంతటా చర్చనీయాంశంగా మారిన తరుణంలో తాజాగా ఎన్నికలపై రాజీవ్ స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో ఈ సారి ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ‘తారక్ ఓటు వేయడానికి రానన్నాడు’ అంటూ జీవిత చేసిన వ్యాఖ్యలపై రాజీవ్ మాట్లాడారు. ‘తారక్‌తో ఆమె మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఆయన ఏం చెప్పారో కూడా తెలీదు. విషయం పూర్తిగా తెలియకుండా నేను సమాధానం చెప్పలేను. కానీ, అసోసియేషన్ సభ్యులందరూ ఎన్నికల్లో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి. తారక్‌తో కూడా మాట్లాతాను’ అని రాజీవ్ అన్నారు.