బాలీవుడ్ వరుసగా లైంగిక వేధింపుల వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రముఖులు నానా పటేకర్, వికాస్ . మీటూ డిబేట్‌లో నానుతుండగా ఈ కోవలో నటుడు, చిత్రనిర్మాత రజత్ కపూర్(57) చేరారు. నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి మహిళల భయానక అనుభవాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. రజత్ కపూర్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారంటూ తాజాగా జర్నలిస్టు సంధ్యా మీనన్ తన అనుభవాన్ని ట్విటర్ వేదికపై పంచుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన రజత్ కపూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. జరిగినదాని పట్ల మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నానని ట్వీట్ చేశారు.
మంచిపనుల ద్వారా జీవితమంతా మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించాను. అయినా నాచర్యల ద్వారా లేదా పదాల ద్వారా బాధపెట్టి వుంటే.. క్షమించండి. దయచేసి క్షమాపణను స్వీకరించమంటూ ట్వీట్ చేశారు. ‘మంచి మనిషిగా ఉండటమే నాకు ముఖ్యం. అలా వుండటానికే ప్రయత్నించాను. ఇకపై మరింత దృఢంగా ప్రయత్నిస్తాను’ అని రజత్ కపూర్‌లో ట్విటర్‌లో పేర్కొన్నారు.
2007లో ఒక టెలిఫోన్ ముఖ్యాముఖి సందర్భంగా రజత్ కపూర్ వేధింపులకు గురి చేశారని, జర్నలిస్టు సంధ్యా మీనన్ ట్విటర్‌లో ఆరోపించారు. తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ దాదాపు పదేళ్ల కిందటి అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందనీ, లైంగికంగా వేధించారంటూ మరో మహిళ వెలుగులోకి వచ్చారు. సౌరభ్ శుక్లా ఫోన్ నుంచి కాల్స్ చేస్తూ రజత్ కపూర్ తరచూ తనను వేధింపులకు గురి చేశారని అమెరికాకు చెందిన యువనటి మోడల్, ఆరోపించారు. కపూర్ దుష్ప్రవర్తన గురించి శుక్లాకు తెలుసునని బహుశా ఇద్దరూ కలిసే అమ్మాయిలను మభ్యపెడుతూ ఉండొచ్చన్నారు.
I am sorry from the bottom of my heart- and sad that I was the cause of this hurt
to another human being.If there is one thing more important to me than even my work,
it is to be a good human being.
And I have tried to be that person.
And now, I will try harder.— Rajat Kapoor (@mrrajatkapoor) October 7, 2018