టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన కొత్త సినిమాను ప్రకటించారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందనున్న ఆ సినిమాను క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డాక్టర్ జి.ధనుంజయన్ నిర్మిస్తున్నారు. స్టోరీ లైన్ విన్న వెంటనే రాజశేఖర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తెలుగులో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘క్షణం’ సినిమాని తమిళంలో శిబిరాజ్తో ‘సత్య’ గా తెరకెక్కించి అక్కడ ‘భేతాళుడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. అయితే హీరోయిన్ తో పాటు సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా నిర్ణయించలేదని, త్వరలో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.