HomeTelugu Big StoriesNIA ఆఫీసర్ గా రాజ‌శేఖ‌ర్‌!

NIA ఆఫీసర్ గా రాజ‌శేఖ‌ర్‌!

సమాజం లో అంతర్గతంగా జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అరికట్టడానికి  భారత ప్రభుత్వం చేత , స్థాపించబడ్డ సంస్థ ‘నేషనల్ ఇన్విష్టిగేషన్ ఏజన్సీ’ 2008  లో స్థాపించ‌బ‌డింది. పోలీస్ , పారా మిలటరీ, CBI వీటితో పాటు NIA అనే ఒక ఇన్విష్టిగేషన్ నిఘా సంస్థ ప్రజా శ్రేయస్సుకై  ఏర్పడింది. యాంటీ సోషల్ యాక్టివిటి అనగానే ముందుగా గుర్తుచ్చేది ఉగ్రవాదం. ఉగ్రవాదం అంటే అభం శుభం తెలియని ప్రజల్ని చంపడం మాత్రమే కాదు. యువతను పెడదోవ పట్టించడం , పది మందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం , మారక ద్రవ్యలని పరాయి దేశం నుంచి తెచ్చి మన దేశం లోని సంపద ను అక్కడి కి తరలించడం ఇలాంటి కార్య కలాపాలు అన్ని ఉగ్రవాదం లోని బాగమే అటు వంటి అతీత శక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే NIA ధ్యేయం.
సరిగ్గా ఇటువంటి పాత్రలో నే ‘PSV గరుడవేగ126.18 ఎం’ సినిమా లో డా. రాజశేఖర్ NIA ఆఫీసర్, శేఖ‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నారు. తనకు సహచరులు గా రవి వర్మ , చరణ్ దీప్ లు చేస్తున్నారు. ఒక గుండె బలానికి బుద్ది బలం, కండ బలం తోడైతే ఆ జట్టు ఎంత పటిష్టం గా వుంటుందొ అలా సాంకేతిక బలం తో రవి వర్మ , కండ బలంతో చరణ్ దీప్‌లు రాజశేఖర్ కి   కుడి ఎడమ భుజాల్ల వ్యవహరిస్తారు.ఎన్నో సవాళ్లు , ప్రతి సవాళ్లు తో కూడుకున్న ఆఫీసర్ శేఖర్‌కి . ప్ర‌తి చిన్న విష‌యాన్ని భూత‌ద్దంలో చూసే పై ఆఫీస‌ర్ స్థానంలో నాజ‌ర్‌, కొంచెం ఇంటికి లేటు గా వచ్చిన తను చెప్పిన పని చేయక పోయిన అలిగి కోపగించుకొనే భార్యగా పూజా కుమార్ మరో వైపు.  వీరి ఇద్దరి మధ్య ఛాలెంజ్ తో కూడుకున్న ఉద్యోగం అటు వంటి పరిస్థితులలో  వున్నా శేఖర్ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమంగా చేస్తూ కుటుంబం లో చిన్న చిన్న కలహాల్ని ఎదుర్కొంటూ ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాడు తన మిషన్నీ ఎంతటి వేగం తో పరిగేత్తిoచాడు అనేది కధాంశం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu