HomeTelugu Trendingహాస్పటిల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన రాజశేఖర్

హాస్పటిల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన రాజశేఖర్

Rajasekhar recovered and di
హీరో రాజశేఖర్‌ గత కొన్ని రోజుల క్రితం రాజశేఖర్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. వెంటిలేటర్‌పై ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటన్నింటినీ ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్‌ మీద చికిత్స అందించలేదని, ఆ వార్తలు అవాస్తవమని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు. అనంతరం ప్లాస్మా థెరపీ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్చార్జి చేశారు. ఈ నేపధ్యంలో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు జీవిత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu