టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’. ఇటీవల కొవిడ్-19కు గురై తీవ్ర అనారోగ్యం పాలైన రాజశేఖర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కోలుకుని బయటకు వచ్చిన ఆయన తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు లలిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందించనున్నారు. ఈ రోజు (గురువారం) రాజశేఖర్ పుట్టిన రోజు ఈ సందర్భంగా `శేఖర్` సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో రాజశేఖర్ సగం ముఖం కనిపిస్తుంది. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్ అయిన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
Thanking you all from the bottom of my heart!
Here is #Shekar @lalith_filmaker @anuprubens #LakshmiBhupala #TammareddyBharadwaja @LakshyaProduct1 @PegasusCineC @ShivathmikaR @Rshivani_1 #MallikarjunNaragani @Ticket_Factory pic.twitter.com/EA07GKuoYn— Dr.Rajasekhar (@ActorRajasekhar) February 4, 2021