సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై బులెటిన్ విడుదల చేసింది ఈ ఆస్పత్రి యాజమాన్యం. ఈ క్రమంలో శనివారం ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
”కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో చేరిన డాక్టర్ వి.రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల చికిత్సకు స్పందిస్తున్నారు. ఐసీయూలో ఉన్న రాజశేఖర్‌కు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నాం, ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు” అని సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిశోర్ వెల్లడించారు.
Daddy is recovering!
Grateful for the team of doctors at @CitiNeuro lead by Dr.Krishna Prabhakar Garu.
Thanks to dear Dr.Madhu garu for always being there for us!
Tq all so much for your prayers and wishes!
Keep us in your thoughts,
We’ll come out stronger💜 pic.twitter.com/3kgzRVIh7C— Shivathmika Rajashekar (@ShivathmikaR) October 31, 2020