HomeTelugu TrendingRajasekhar: కల్కి సినిమా టికెట్లతో నాకు సంబంధం లేదు అంటున్న రాజశేఖర్..

Rajasekhar: కల్కి సినిమా టికెట్లతో నాకు సంబంధం లేదు అంటున్న రాజశేఖర్..

kalki
Rajasekhar clears the air about Kalki tickets

Rajasekhar Funny Tweet: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా కల్కి 2898 ఏడి. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుంది అని అభిమానులు అందరూ పనులు మానుకొని మరీ ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు.

అయితే 2019లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి సినిమా కూడా ఈ వారం రీరిలీజ్ కాబోతోంది. దీంతో చాలామంది అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యి కల్కి 2898 ఏడి సినిమాకి బుక్ చేయబోయి కల్కి సినిమాకి టికెట్లు బుక్ చేశారు. కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో ఆరు షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి.

కల్కి 2898 సినిమా అనుకోని కల్కి రీరిలీజ్ కి టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా రాజశేఖర్ రెస్పాండ్ అయ్యారు. దీనికి తనకి ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు.

కుకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ఆరు షోలు హౌస్ ఫుల్ అయ్యాయి అన్న వార్తని షేర్ చేస్తూ రాజశేఖర్ ఇలా ట్వీట్ చేశారు. “నాకు అస్సలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే ప్రభాస్ కి, నాగ్ అశ్విన్ కి, మా వైజయంతి ఫిలిమ్స్ అశ్విని దత్ గారికి, సినిమా నటీనటులకి, చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్. ఈ సినిమాతో మీరు రికార్డు సృష్టించి ఇండస్ట్రీని ఒక అడుగు ముందుకు తీసుకువెళతారని ఆశిస్తున్నాను” అని ఫన్నీగా రిప్లై ఇస్తూ చిత్ర బృందానికి విషెస్ చెప్పారు.

ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పఠాని, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్ తదితరులు క్యామియో పాత్రులలో కనిపించనున్నారు.

Rajasekhar upcoming ventures: ఇక సినిమాల పరంగా చూస్తే రాజశేఖర్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలలోనే కనిపిస్తున్నారు. ఆఖరి సారిగా రాజశేఖర్ గతేడాది నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. రాజశేఖర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా క్లారిటీ లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu