సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసును షేక్ చేస్తోంది.
రజనీకాంత్ జైలర్ మూవీ 5 రోజుల్లోనే రూ.350 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. తెలుగులో సోమవారం నాటికి ఈ సినిమా నలభై కోట్ల వరకు గ్రాస్‌ను, ఇరవై నాలుగు కోట్ల షేర్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది.
రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన జైలర్ నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.11 కోట్ల వరకు వసూలు అయింది.
ఇండియాతో పోలిస్తే ఓవర్‌సీస్‌లో జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఓవర్‌సీస్‌లో ఇప్పటివరకు 150 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో 100 కోట్లు, కర్ణాటకలో 37 కోట్లు, కేరళలో 28 కోట్లు సాధించింది.
జైలర్ మూవీ రిలీజైన 5 రోజుల్లో ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్ల గ్రాస్‌ను రూ.173 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 120 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జైలర్ మూవీ రిలీజ‌్ అవ్వగా 5 రోజుల్లోనే రూ.50 కోట్ల వరకు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.