“సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “2.ఓ” ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా త్వరలోనే “2.ఓ” ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ ట్రైలర్ గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
“2.ఓ” చిత్రాన్ని 3డీలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ అనుభూతిని ఆస్వాదించాలంటే అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్‌లోనే చూడాలి. అయితే, చిత్ర ట్రైలర్‌ను 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేయనున్నట్లు సమాచారం. చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ఈవెంట్‌ను నిర్వహించి, అక్కడే ట్రైలర్‌ను విడుదల చేస్తారట. ఇది నిజమైతే, 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా “2.ఓ” రికార్డు సృష్టించనుంది. దాదాపు రూ.450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అమీజాక్సన్ హీరోయిన్ కాగా అక్షయ్‌కుమార్ విలన్ ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ “2.ఓ” వీఎఫ్‌ఎక్స్ పనుల ఆలస్యంగా కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడుతూ వచ్చింది. “రోబో” కు కొనసాగింపుగా తర్వాత రజనీ-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.