మహారాష్ట్రలో శివాజీ రావు గైక్వాడ్ గా పుట్టి రజనీకాంత్ గా మారి తమిళ నాట అపారమైన పేరు సంపాదించాడు మన సూపర్‌స్టార్. ప్రధానంగా తమిళ్ సినిమాలో ఎక్కువ పనిచేసేనా దక్షిణ భారత సినీ నటుడిగానే ప్రపంచంలో బాగా గుర్తింపు పొందుతున్నాడు. బస్సు కండక్టర్ గా బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో పనిచేస్తున్నప్పుడు రజనీ నటించడం మొదలుపెట్టాడు. 1973లో ఆయన నటనలో డిప్లొమా కొనసాగించడానికి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. K. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అపూర్వ రాగాంగల్ (1975) లో తన తొలిసారిగా నటించాడు. తన నటనా వృత్తిని తమిళ్ చిత్రాలలో విభిన్న పాత్రలతో పోషించటం ప్రారంభించారు.
రజనీ కాంత్ అభిమానులకు డిసెంబర్ నెల అంటే చాలా ప్రత్యేకం అనే చెప్పాలి ఆయన అభిమానులు సౌత్ లో ఆయన పుట్టిన రోజున చాలా కార్యక్రమాలు చేస్తారు. ప్రతీసారి ఆయన తన అభిమానులకు తన పుట్టిన రోజున సినిమా గురించి సరికొత్త ట్రీట్ ఇస్తారు. ఈ ఏడాది కూడా ఆయన పుట్టిన రోజు సందర్భంగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కీర్తి సురేష్ జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ నిన్న పూజ కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, మీనా, ఖుష్బూ, దర్శకుడు శివ, నిర్మాతలు హాజరయ్యారు. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 70 సంవత్సరాల వయసులోనూ ఆయన ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకి సైతం పోటీ ఇస్తున్నారు.