ప్రముఖ దర్శకుడు రాజమౌళితో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రాజమౌళిని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో బాహుబలి: ది బిగినింగ్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించింది. కొద్దిరోజులకే దాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మరోసారి రాజమౌళిని సంప్రదించిందట. అయితే దీనిపై రాజమౌళి గాని, నెట్‌ఫ్లిక్స్ గాని స్పందించలేదు.
ఇప్పటికే పలువురు దర్శకులు వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించగా ఇప్పుడు ఈ జాబితాలోకి రాజమౌళి వస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ వెబ్ సిరీస్‌ను భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి చేసే ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.