ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఖ్యాతి ‘RRR’ విడుదల తర్వాత వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఆస్కార్ వేడుకలు ముగిసిన తర్వాత మహేష్ బాబుతో చేయబోయే మూవీపై దృష్టి పెట్టాడు జక్కన్న. నిజానికి SSMB29 జూన్ లేదా జులైలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపించినా ఆ తరువాత వాయిదాపడినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే, దర్శకుడిగా ప్రపంచస్థాయిలో పాపులారిటీ సంపాదించిన రాజమౌళి.. ఒక కమర్షియల్ యాడ్ కోసం నటుడిగా మారారు. మొబైల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఒప్పో’ కోసం రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఒక యాడ్‌ను చిత్రీకరించారు. అయితే, దీని గురించి అఫిషియల్‌గా ప్రకటించనప్పటికీ.. యాడ్ మేకింగ్ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రాజమౌళి క్రీమ్ కలర్ బ్లేజర్, రౌండ్ నెక్ టీ షర్ట్ సహా మ్యాచింగ్ ట్రౌజర్ ధరించారు. స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఫారిన్‌లో జరిగినట్లు తెలుస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు చిత్రీకరించినట్లు టాక్.
రాజమౌళి గతంలో ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో కాసేపు తళుక్కుమన్నారు. బాహుబలి, మజ్ను ల్లో కనిపించారు. అయితే ఇప్పటిదాకా ఇలాంటి చిన్న చిన్న పాత్రల్లో సరదాగా కనిపించిన రాజమౌళి.. ఇప్పుడు ఏకంగా కమర్షియల్ యాడ్‌లో నటించడం విశేషం.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు