HomeTelugu Trendingమహేశ్‌ బాబుపై రాజామౌళి ప్రశంసలు

మహేశ్‌ బాబుపై రాజామౌళి ప్రశంసలు

rajamouli thanks to actor m
సంక్రాంతికి విడుదలకావాల్సిన తన సినిమాను వేసవికి వాయిదా వేసినందుకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుపై డైరెక్టర్‌ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్‌ మీడియా వేదికగా మహేశ్‌తోపాటు పవన్‌ కల్యాణ్‌, పలువురు నిర్మాతల్ని అభినందించారు. పాన్‌ ఇండియా సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మహేశ్‌బాబు తాను నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ను 2022 సంక్రాంతి నుంచి ఏప్రిల్‌ 1కి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సీజన్‌లో విడుదలకావాల్సిన ‘భీమ్లానాయక్’, ‘ఎఫ్‌ 3’ లను వాయిదా వేస్తున్నట్టు ఆయా చిత్ర బృందాలు తాజాగా వెల్లడించాయి.

ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్‌ చేశారు. ‘సంక్రాంతి సీజన్‌కి రావాల్సిన సరైన సినిమా ‘సర్కారువారి పాట’. అయినప్పటికీ ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహేశ్‌ తన చిత్రాన్ని వేసవికి వాయిదా వేశారు. ఎవరికీ ఎలాంటి సమస్యా లేకుండా ఉండేందుకు ఆయన తీసుకున్న చొరవ అభినందనీయం. ‘సర్కారు..’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, ‘భీమ్లానాయక్‌’ నిర్మాత చినబాబు, నటుడు పవన్‌ కల్యాణ్‌, ‘ఎఫ్‌ 3′ చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆయా సినిమాలు మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా 2022 జనవరి 7న విడుదలకానుంది. ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ జనవరి 14 ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే.. జనవరి 12న విడుదలకావాల్సిన భీమ్లానాయక్, ఫిబ్రవరి 25కి, ఎఫ్‌ 3 ఏప్రిల్‌ 29కి వాయిదా పడ్డాయి. మరోవైపు, రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu