HomeTelugu TrendingGame Changer: రాజమౌళి సెంటిమెంట్ నుండి ఈ ఇద్దరు స్టార్ హీరోలు బయటకి వచ్చేశారా?

Game Changer: రాజమౌళి సెంటిమెంట్ నుండి ఈ ఇద్దరు స్టార్ హీరోలు బయటకి వచ్చేశారా?

Rajamouli sentiment in Game Changer and Devara
Rajamouli sentiment in Game Changer and Devara

Game Changer Release Date:

ఇప్పటిదాకా కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా అందుకొని డైరెక్టర్లలో రాజమౌళి పేరు ముందే ఉంటుంది. రాజమౌళితో సినిమా చేస్తే.. కచ్చితంగా అది బ్లాక్ బస్టర్. అప్పటిదాకా ఫ్లాపుల్లో ఉన్న హీరో కూడా రాజమౌళితో బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాజమౌళితో ఒక సెంటిమెంట్ ఉంది.

రాజమౌళితో సినిమా చేసి హిట్ అందుకున్న ఏ హీరో కూడా ఇప్పటిదాకా నెక్స్ట్ సినిమాతో హిట్ అందుకోలేదు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇలా ఏ హీరో కూడా రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్స్ చవిచూశారు. కానీ తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సెంటిమెంట్ నుంచి బయటకు వస్తున్నారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గతంలో రాజమౌళితో సినిమాలు చేసినప్పుడు ఈ ఇద్దరు హీరోలు ప్లాప్స్ అందుకున్న వాళ్లే. ఆల్రెడీ ఒకసారి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ ఇది వర్కౌట్ అవదు అని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరూ రాజమౌళి దర్శకత్వంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్, ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలతో బిజీగా ఉన్నారు.

రెండు సినిమాల మీద మంచి బజ్ ఉంది. అయితే గేమ్ చేంజర్ విషయంలో శంకర్ కారణంగా కొంచెం హైప్ తగ్గింది. జరగండి అంటూ విడుదలైన ఒక పాట కూడా అంతంతమాత్రంగానే ఆకట్టుకుంది. మరోవైపు దేవరా మీద మంచి బజ్ కొనసాగుతోంది. తాజాగా విడుదలైన చుట్టమల్లే పాట కూడా మంచి హిట్ అయింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ సినిమా ఒక అడుగు ముందు ఉంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసెంబర్ లో విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాలు రాజమౌళి సెంటిమెంట్ నుంచి తప్పించుకుంటాయి అంటూ.. టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu