
SSMB29 title:
సూపర్ స్టార్ మహేశ్ బాబు – డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో రూపొందే ఈ సినిమా అడ్వెంచర్ జానర్‌లో ఉంటుందని, అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేయడం వల్ల ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తోంది. అంతేకాదు, ఇటీవల ఆమె మహేశ్‌తో కలిసి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ వర్క్‌షాప్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. “మహారాజ్”, “గరుడ” లాంటి పేర్లు మొదట వినిపించాయి. కానీ, రాజమౌళి మాత్రం మరో కొత్త టైటిల్‌పై దృష్టి సారించారని టాక్. తాజా సమాచారం ప్రకారం, “జెనరేషన్” కాన్సెప్ట్ ఆధారంగా టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో మహేశ్ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ ఈ పాత్ర పోషించబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మహేశ్ తండ్రిగానా లేక మరో కీలక క్యారెక్టర్లోనా కనిపిస్తారో స్పష్టత లేదు. మరోవైపు, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్.
ఈ సినిమా నిర్మాణంలో రాజమౌళి అత్యధిక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ సమీకరించడంతో పాటు, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్రత్యేక బృందాలను పని చేయిస్తున్నారు. సాధారణంగా సినిమాను లాంచ్ చేసే ముందు ప్రెస్ మీట్ నిర్వహించే రాజమౌళి, ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.