బాహుబలి.. ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా ఈ సినిమా సాధించిన క్రెడిట్ దాటడం కాదు కదా దానికి సరిసమానంగా నిలవాలన్నా కూడా సామాన్యమయిన విషయం కాదు. వసూళ్ల పరంగా కూడా రెండు పార్ట్శ్ కి కలిపి ఇప్పటివరకు సాధించిన మొత్తం 2 వేల మూడువందలకోట్లకు పైనే. ఎందుకంటే ఇంకా కొన్ని భాషల్లోకి ఈ సినిమాని డబ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ టీమ్ మొత్తం కలిసి మళ్ళీ ఇంతకు రెండింతలు ఎఫర్ట్ పెడితే బాహుబలి ని క్రాస్ చెయ్యొచ్చు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో తయారయిన పద్మావతి సినిమా గురించి అంతా ఒక రేంజ్ లో పొగుడుతున్నారు. ఇది ఒక అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి బాహుబలి గురించి మాట్లాడడానికి మొహమాటపడిన హిందీ జనాలు పద్మావతి గురించి ఈ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ హుందాతనానికి మారుపేరయిన రాజమౌళి మాత్రం పద్మావతి గురించి తను ఏం అనుకుంటున్నాడో, ఆ మాట నే ట్వీట్ రూపంలో బయటపెట్టాడు.
పద్మావతి ట్రైలర్ అత్యంత అందంగా ఉందని, ప్రతి ఫ్రేమ్ ని మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు. అలాగే సినిమాలో మిగతా వాళ్ళ గురించి ప్రస్తావించని రాజమౌళి అల్లా ఉద్దీన్ ఖిల్జి గా నటిస్తున్న రణ్వీర్ సింగ్ గురించి ఆసక్తికరమయిన విషయాలు బయటపెట్టాడు. క్రూరమయిన క్యారెక్టర్ లో రణ్వీర్ సూపర్ గా ఉన్నాడని, అతని నుండి చూపు తిప్పుకోలేపోయానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్స్ వల్ల ఇంకో సీక్రెట్ బయటపడినట్టయింది. రాజమౌళి తరువాతి సినిమా మూడు భాషల్లో ఉంటుందని హిందీ నుండి రణ్వీర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వినిపించాయి.ఇదంతా చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. ఇక తెలుగునుండి ఎన్టీఆర్ అనేది కూడా ఆల్మోస్ట్ కంఫర్మ్. సో,జనవరిలో తన ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా అన్న జక్కన్న కేవలం డైరెక్టర్ గానే కాకుండా తన బిహేవియర్ తో కూడా అందరిని ఆకట్టుకుంటున్నాడు. అయితే ట్రైలర్ ప్రశంసలు అందుకున్న పద్మావతి,సినిమాగా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే.