కేజీఎఫ్ కథ నీచ్ కమీన్ కుత్తే అంటూ వెంకటేశ్ మహా అనే ఒక కుర్ర తెలుగు దర్శకుడు కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా హిట్టయిన కేజీఎఫ్ సినిమాపై తనకిష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడానికి అసలు ఈ వెంకటేశ్ మహాకి ఉన్న అర్హత ఏమిటి ?, ఒక సినిమా ఎలా ఉండాలి ?, ఒక కథను ఎందుకు తీయాలి ? అని చెప్పడానికి ఇతను ఎవరు ?, రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే కేజీఎఫ్ సినిమా చూసి ఫిదా అయ్యాడు. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్లు కేజీఎఫ్ దర్శకుడితో సినిమా చేయడానికి ఎంతగానో ఉత్సహ పడ్డారు. అలాంటి దర్శకుడి పై, అలాంటి కేజీఎఫ్ చిత్రం పై ఈ వెంకటేశ్ మహా చేసిన కామెంట్స్ మరీ సిల్లీగా ఉన్నాయి. కేజీఎఫ్ సినిమా కథలోనే పెద్ద బొక్క ఉందనేది ఇతగాడి ఫీలింగ్.
కేజీఎఫ్ కథ పై వెంకటేశ్ మహా ఏం అన్నాడో తెలుసా ?, “తల్లి ఓ కొడుకును ఎప్పటికైనా గొప్పోడు అవ్వమని కోరుతుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని ఆమె ఉద్దేశం. అతడు మనుషుల్ని పెట్టి బంగారం తవ్విస్తాడు. వాడి దగ్గర కొన్ని వేల మంది పనివాళ్లు ఉంటారు. వాళ్లకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు ఇచ్చి, మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారేస్తాడు. వాడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడుగుతుంది. ఆ మహాతల్లిని నేను ఒకసారి కలవాలి. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి హిట్ చేస్తున్నాం.” అని తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేశాడు వెంకటేశ్ మహా. అంతటితో ఆగాడా ? లేదు. అంతకు మించి మాట్లాడాడు.
వెంకటేష్ మహా ప్రేక్షకుల్లో తనకున్న క్రెడిబిలిటీ వల్ల అలాంటి సినిమాలు తీయడం లేదు. వీడి పైత్యానికి ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉంటుందా ?, అసలు వెంకటేష్ మహా అనే వ్యక్తి తన జీవితంలో తీసింది రెండు సినిమాలు. అందులో ఒకటి మలయాళ రీమేక్. మక్కీకి మక్కీ కాపీ కొట్టాడు. ఇక అదృష్టం కలిసి వచ్చి.. అతను తీసిన మొదటి సినిమా హిట్ అయ్యింది. ఆ సినిమా టేకింగ్ వరెస్ట్ గా ఉంటుంది. కానీ.. కంటెంట్ నచ్చడంతో ప్రేక్షకులు ఆ సినిమాని హిట్ చేశారు. దానికే ఇతగాడికి కొమ్ములు మెలిచాయా ?. ఇతగాడు తన అభ్యుదయవాదం పక్కనపెట్టి, పెన్ను బదులు కత్తి పట్టుకుంటే, వాళ్లు బాబులాగ సినిమా తీస్తాడట.
తనకున్న సృజనాత్మక దృష్టికి హింసను కూడా సౌందర్యాత్మకంగా చూపించగల శక్తి తనకుందట. కానీ తానే కావాలనే అలాంటి పనులు చేయడం లేదట. ఇదండీ వెంకటేష్ మహా అనే దిగువస్థాయి దర్శకుడు కూసిన కూతలు. కేజీఎఫ్ లాంటి సినిమాపైనే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అంటే.. వెంకటేష్ మహాకి కాస్త పిచ్చి ముదిరింది అనుకోవాలి. అయినా, కేజిఎఫ్ లాంటి సినిమాని నిన్ను ఎవడు తీయొద్దన్నాడు బాబు. అసలు కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఇతగాడికి అర్ధం అయ్యి ఉండదు. ఎలాగూ అలాంటి సినిమా తీయడం చేతకాదు కాబట్టి.. ఇలా పిచ్చి కూతలు కూస్తూ తృప్తి పడుతున్నాడు.
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు