HomeTelugu Trendingరామ్‌చరణ్‌ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

1 14
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. కానీ ముందుగా రామ్‌చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం దర్శక ధీరుడు రాజమౌళికి ఇచ్చారట. అయితే చరణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయటానికి రాజమౌళి భయపడ్డారట. చిరుత సినిమా తర్వాత రామ్‌చరణ్ వరుస ఆఫర్లతో లవ్‌, రొమాంటిక్ సినిమాల్లో నటించాడు. దీంతోపాటు మాస్‌ హీరోగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమాలో నటనకు ఎంతోమంది దర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌చరణ్‌లోని ప్లస్, మైనస్‌లు తనకు తెలియకపోవడంతోనే చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని తీసుకోలేకపోయానని అన్నారు. చెర్రీ ఫైట్స్ ఎలా చేస్తాడో తనకు తెలియదన్నారు. డ్యాన్స్, ఎమోషన్స్ విషయంలో కూడా అవగాహన లేదన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిరంజీవి తనయుడి ఎంట్రీ అంటే ఆయన అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయని, వాటిని మనసులో పెట్టుకునే చిరంజీవి ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu