ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ కుమార్తె పూజ ప్రసాద్ తో ఈ నెల 30న జరగనున్న సంగతి తెలిసిందే. జైపూర్లోని ఒక ప్రముఖ హోటల్లో ఈ వివాహం వేడుక జరగనుంది. ఇప్పటి నుండే ఈ వేడుక పనులు మొదలయ్యాయి. రాజమౌళి కూడ తన పూర్తి సమయాన్ని ఈ పనుల కోసమే కేటాయించాలి అనుకున్నారు. అందుకే ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్‌లతో చేస్తున్న మల్లీస్టారర్ పనులన్నింటికీ పూర్తి బ్రేక్ ఇచ్చి పెళ్లి పనుల్లో మునిగిపోయారు రాజమౌళి. చరణ్ కూడ ఈ గ్యాప్లో బోయపాటితో చేస్తున్న ‘వినయ విధేయ రామ’ షూటింగ్లో పాల్గొంటుండగా తారక్ బ్రేక్ లో ఉన్నారు.