దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి.. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్స్ అకాడమీ నుంచి పలువురు భారతీయ ప్రముఖులకు పిలుపు అందింది. వారిలో శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న ట్వీట్ చేస్తూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్లు ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ అకాడమీ నుంచి మీకు పిలుపు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ సర్’ అని పేర్కొన్నారు.
‘బాహుబలి: ది బిగినింగ్’, ‘2.ఓ’ చిత్రాలకు శ్రీనివాస్ విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, రితేశ్ బాత్రాలకు కూడా అకాడమీ ఆహ్వానం అందింది. వీరు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లు దక్కించుకునే చిత్రాలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసే విషయంలో భాగస్వాములు కానున్నారు.