S.S. Rajamouli: ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తూ.. స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరిగా ‘RRR’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజమౌళి తన నెక్ట్స్ ప్రొజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు(SSMB29)తో చేయనున్నారు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ రేంజ్‍లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది రూపొందనుంది. ఆ సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడు అని రాజమౌళి చెప్పాలని అనిల్ రావిపూడి అడిగారు. దేవర గురించి కొరటాల శివను కూడా ప్రశ్నించారు. ‘రాజమౌళి స్పీచ్‍లో ఓపెనింగ్ డే ఎప్పుడు? ఓపెనింగ్ డే రోజు ఆయన సినిమా కథ చెబుతారు.
అసలు ఏ జానర్, ఏ సినిమా తీస్తున్నారో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ రెండు విషయాలను చెబుతారని ఆశిస్తున్నాను’ అని అనిల్ రావిపూడి అన్నారు. మహేశ్ బాబుతో సినిమా గురించి అడగటంతో అనిల్ రావిపూడి గురించి సరదాగా స్పందించారు ఎస్ఎస్ రాజమౌళి. అతడిని ఎవరైనా గుద్దేస్తే రూ.10వేలు ఇస్తానని అన్నారు. ‘ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని.. వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే రూ.10వేలు ఇస్తా’ అని రాజమౌళి సరదాగా అన్నారు.
రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌పై అనిల్ రావిపూడి అదే రేంజ్‍లో రెస్పాండ్ అయ్యారు. ‘దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. రూ.10వేలు అంటే వచ్చేస్తారు’ అని అనిల్ స్పందించారు. ఈ సంభాషణ చాలా సరదాగా సాగింది.
తనకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరో అన్న ప్రశ్నకి రాజమౌళికి ఎదురైంది. దీంతో ఎన్టీఆర్ అని కొందరు అరిచారు. అయితే, తారక్ (జూనియర్ ఎన్టీఆర్) తనకు ఫ్రెండ్ కాదని, తమ్ముడిలాంటి వాడని ఆయన అన్నారు. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి, బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డ తన క్లోజ్ ఫ్రెండ్స్ అని జక్కన్న చెప్పారు.
మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకు ఇంకా సమయం ఉందని, త్వరలో అప్‍డేట్స్ వస్తాయని ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. కృష్ణమ్మ చిత్రానికి సమర్పకుడిగానూ కొరటాల ఉన్నారు. “చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను మొదలుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. ఏ కథకైనా, పాత్రకైనా ఆయన కటౌట్, వాయిస్ బాగా సెట్ అవుతుంది. ఐపీఎల్‌ను రెండు, మూడు రోజులు పక్కనపెట్టేయండి. థియేటర్లకు వెళ్లి సినిమాను చూడండి” అంటూ అనిల్ ప్రేక్షకులను కోరారు.