టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సోషల్ మీడియా వేదికగా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు శుభాకంక్షాలు తెలిపాడు. ఆయన తన ట్వీట్టర్‌లో వర్మ తాతయ్య అయ్యాడంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ‘రామూ తాతయ్య గారూ. చిట్టచివరకు మీకు కళ్లెం వేసేందుకు మీ మనవరాలు వచ్చేసింది. ఇక మిమ్మల్ని ఏమని పిలవాలి? రామూ తాతా లేదా రామూ నాన్నా లేదా గ్రాండ్ పా రామూ?’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలు విషయం ఏమిటంటే.. నిన్న ఉదయం 7:30 గంటలకు వర్మ కుమార్తె రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఆర్జీవీ కుమార్తె రేవతి వర్మ కుమార్తె వివాహం 2013లో జరిగింది. వృత్తి రీత్యా వైద్యురాలైన రేవతి, డాక్టర్ ప్రణవ్‌ను పెళ్లిచేసుకుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగితేలి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వర్మ ఆనందంలో మునిగితేలుతున్నాడు.
Congratulations Ramu thaatayya garu…😂😂😂💕🤣❤️❤️
Wishing your granddaughter will be the person who will finally rein you in… btw what do you prefer
Ramu tata
Ramu Nanna or
Grandpa Ramu…@RGVzoomin 😂😂🤣— rajamouli ss (@ssrajamouli) February 10, 2020