ప్రముఖ దర్శకుడు రాజమౌళి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటీ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినా ముందుగా కథపై కావలిసినంత కసరత్తు చేస్తారని తెలిసిందే.
కథకు తాను విజువల్‌గా అనుకున్న రూపం వచ్చే వరకు చెక్కుతూనే ఉంటారనే టాక్ ఉంది. అందుకే ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా (SSMB29) కోసం సిద్ధమవుతున్న రాజమౌళికి ‘మహాభారతం’ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిందే. కాగా ఈ మూవీపై తన అభిప్రాయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘మహాభారతం’ ఆధారంగా సినిమా తీయాడం అనేది రాజమౌళి కళ. ఇది చాలా ఏళ్లుగా వాయిదాపడుతూ వస్తోంది. అయితే అంతపెద్ద స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా ఎలా రూపొందించాలనే విషయంలో ఆయనకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మహాభారతం చాలా విస్తారమైన, సంక్లిష్టమైన కథ. ఇప్పటికే 260-ఎపిసోడ్లతో టెలివిజన్ సిరీస్‌తో పాటు చాలా ఏళ్లుగా అనేక రూపాల్లో ఆవిష్కరించబడిందని రాజమౌళి అంగీకరించారు. అయితే ఈ స్టోరీని పది భాగాలుగా రూపొందించాలని ఉందంటూ వివరించాడు.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అపూర్వమైన ఫీట్‌గా, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలి అని రాజమౌళి అనుకుంటున్నారు. అందుకే మహాభారతాన్ని మల్టిపుల్ పార్ట్స్‌గా తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్రస్తుతం SSMB29 మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు